బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన సర్పంచ్ బీరప్ప.....

బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించిన సర్పంచ్ బీరప్ప.....

బొమ్మలరామారం (ముద్ర న్యూస్):ఆలేరు శాసనసభ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని బొమ్మలరామారం మండలంలో గల నాగినేనిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి గ్రామ సర్పంచ్ బట్కూరి బీరప్ప ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని అమలు చేశారని చెప్పారు. రానున్న ఎన్నికలలో మూడోసారి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించడం ద్వారా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశాభావం ఎప్పుడు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు. బిఆర్ఎస్ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు.