గౌడ ఐక్య సాధన సమితి జిల్లా కమిటీని ప్రకటించిన వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ గౌడ్

గౌడ ఐక్య సాధన సమితి జిల్లా కమిటీని ప్రకటించిన వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ గౌడ్

ఆలేరు (ముద్ర న్యూస్):తెలంగాణ రాష్ట్ర గౌడ ఐక్య సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నారాయణ గౌడ్, కల్లుగీత కార్మిక చైర్మన్ పల్లె రవి కుమార్ లు సోమవారం నాడు రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ బైరి మహేందర్ గౌడ్ తో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా గౌడ ఐక్య సాధన సమితి జిల్లా కన్వీనర్ గా ప్రముఖ పాత్రికేయులు దూడల సాగర్. జిల్లా యువజన భాగం ప్రధాన కార్యదర్శిగా దూడల మురళీధర్ గౌడ్. కార్యదర్శిగా ఉట్కూరి నరేందర్ గౌడ్. ఆలేరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులుగా ఉట్కూరి సురేష్ గౌడ్ లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.