జగిత్యాల డిఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటస్వామి

జగిత్యాల డిఎస్పిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటస్వామి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల డిఎస్పీగా ఎన్ వెంకట్ స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డిఎస్పి ప్రకాశ్ ను హైదరాబాద్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో ఖమ్మం సిటిసిలో ఏసిపిగా పనిచేస్తున్న వెంకటస్వామిని జగిత్యాల డిఎస్పీ బదిలీ చేస్తూ డిజిపి అంజన్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయగా ఈ మేరకు డిఎస్పి ప్రకాష్ నుంచి వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఈ  సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గతంలో సారంగాపూర్, గొల్లపల్లి, పోలీస్ స్టేషన్లో ఎస్సైగా, వేములవాడ సిఐ గా పనిచేసిన అనుభవంతో ఈ ప్రాంతం పై మంచి అవగాహన ఉందని తెలిపారు.