ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆడిపోసుకోవడం సరికాదు

ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆడిపోసుకోవడం సరికాదు

జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసింది శూన్యం

ముద్ర న్యూస్, మహాదేవపూర్: టిఆర్ఎస్ జడ్పీ చైర్మన్లు కేవలం ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఆడిపోడుచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, చేతనైతే శ్రీధర్ బాబుతో అభివృద్ధిలో పోటీ పడాలని కాంగ్రెస్ నాయకులు కోట రాజబాబు, జడ్పిటిసి గుడాల అరుణ, సీనియర్ నాయకులు వామన్ రావు, శివరాంలు శనివారం నాడు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హితవు పలికారు. భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి పాలకమండలి అధ్యక్షురాలుగా ఉన్న జడ్పీ చైర్మన్ మహాదేవపూర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లను, సీనియర్ అసిస్టెంట్ ను, ఒక హెడ్ నర్సు, ఇద్దరు ఏఎన్ఎం లను జిల్లా కేంద్రానికి డిప్యూటేషన్ పై తరలించి మరోవైపు మహాదేవపూర్ ఆస్పత్రిని సందర్శించి ఆసుపత్రి దుస్థితికి శ్రీధర్ బాబు కారణమని ఆరోపించడం సరికాదని జడ్పీ చైర్మన్ ఎవరు రాసిచ్చిన స్క్రిప్టును అమలు చేసినట్లుగా ఉందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శ్రీధర్ బాబు ప్రతిపక్ష నాయకునిగా మంత్రి హరీష్ రావును కోరడంతోనే మంజూరు చేయడం జరిగింది అని స్పష్టం చేశారు. తను అధికారులు పట్టించుకోవడంలేదని జెడ్పి చైర్మన్ ఆవేదనకు ఒక దళిత మహిళకు పార్టీ భేదం లేకుండా తాము సంఘీభావం ప్రకటించిన విషయం గుర్తు చేసుకోవాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజ బాబు అన్నారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్ విద్యార్థులకు భోజనం పెట్టే సాకుతో సరస్వతి నిలయమైన డిగ్రీ కాలేజీలో రాజకీయాలను ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు.

జెడ్పి చైర్మన్గా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. చేతనైతే డిప్యూటేషన్లు రద్దు పరచి వెంటనే డాక్టర్లను మాదాపూర్ ఆసుపత్రికి రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో అనేక కళాశాలలకు స్థాపించి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధికి ధీటుగా పోటీపడాలని ఆయన హితవు పలికారు. శ్రీధర్ బాబు తప్పుడు ప్రచారం ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు తగిన శాస్తి చేస్తారని ఆయన హెచ్చరించారు. మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీధర్ బాబు మీటింగు పెట్టలేదని జడ్పీ చైర్మన్ విమర్శించాలని, తాను జెడ్పి సభ్యురాలుగా మహాదేవఆసుపత్రి గురించి అనేక సమావేశంలో లేవనెత్తినప్పటికి అధికారంలో ఉన్న మీరు ఈనాటికి ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.

ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్లను సీఎం తరలించి ఇతర ప్రాంతాలకు జీతాలు చెల్లిస్తున్న స్థానికంగా ఉన్న వీరు ఎందుకు వాటిని రప్పించడం లేదని ప్రశ్నించారు అనవసరంగా విమర్శిస్తే ఉన్న గౌరవం పోతుందని జడ్పిటిసి గుడాల అరుణ హితవు పలికారు. జడ్పీ చైర్మన్ చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని, వడ్లు అమ్ముకున్న రైతులకు రెండు నెలలైనా టిఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం లేదని, 14వ, 15వ ఫైనాన్స్ నిధులను తరలించి గ్రామాలలో రైతులను ఇబ్బందులు పెడుతున్నదని మాజీ దేవస్థానం చైర్మన్ వామన్ రావు విమర్శించారు. పుట్ట మధు పార్టీకి సంబంధం లేని కార్యక్రమాలను నడిపిస్తున్నారని రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని దళిత నాయకుడు శివరామ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ ఎంపీటీసీ ఆకుతోట సుధాకర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం అశోక్, మైనార్టీ సెల్ నాయకులు అస్రారు ఖురేషి, గుడాల శ్రీనివాస్, మీసినేని రవి చందర్, నాగరాజు, నాగేందర్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.