కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

భువనగిరి జూలై 12 (ముద్ర న్యూస్) : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సందర్భంగా గోద రాహుల్ గౌడ్  మాట్లాడుతూ రేవంత్ రెడ్డి  ఉచిత విద్యుత్ పైన అమెరికా పర్యటనలో మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులను  ప్రజలను తప్పు దోవ పట్టించడం కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్  రైతుల్లలో ప్రజలలో కాంగ్రెస్ పార్టీని చూసి ఓర్వలేక కుట్ర పూర్తికంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.  రైతులారా ప్రజలారా మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం కోసమే టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పట్ల అండగా ఉంటుందని మీరు అధైర్య పడొద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ వరంగల్ రైతు డిక్లరేషన్ కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోల్లేపల్లి గ్రామ రైతులు చెన్న వెంకట్ రెడ్డి , పాంజాల సత్యనారాయణ , సోమిస్తారి , కనకుంట్ల సురేష్ , గడ్డం అంజయ్య ,బోల్లేపల్లీ గ్రామం వార్డు సభ్యులు గోద శ్రవణ్ గౌడ్ , ముక్కిడి భాను ,ఈరపాక బాలకృష్ణ , గౌడ సంఘం అధ్యక్షలు గోద సాయిలు ,  గ్రామ కాంగ్రెస్ నాయకులు కంసాని భాస్కర్ , నాంపల్లి మల్లేష్ , గోద శేకర్ గౌడ్ , గోద వెంకటేష్ గౌడ్ ,ఓబీసీ జిల్లా జాయింట్  కో-ఆర్డినేటర్ గోద శివశంకర్ , యూత్ కాంగ్రెస్ నాయకులు బూర సందీప్ గౌడ్,బింగి నరేష్ , గోద శివ , గోద మచ్చగిరి , గోద మణికంఠ గౌడ్ , గణపురం నరేష్ , చింతల ప్రశాంత్ , ఎన్.ఎస్.యు.ఐ నాయకులు సాయినిఖిల్ గౌడ్ , హార్షిక్ , చింటు , మల్లేష్  పాల్గొన్నారు.