రైతాంగానికి మొట్టమొదటి శత్రువులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు - జెడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్

రైతాంగానికి మొట్టమొదటి శత్రువులు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు - జెడ్పీ ఛైర్పర్సన్  దావ వసంత సురేష్

జగిత్యాలలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ ఎస్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్  అవసరం లేదని టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసన గా జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద  బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్  చంద్ర శేఖర్ గౌడ్ మాట్లాడుతూ 3గంటలు కరెంట్ ఇవ్వాలని రేవంత్ చేసిన వాక్యాలను ఖండిస్తున్నామని,  కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులను గోస పెట్టాలని చూస్తున్నారని అన్నారు. రైతులను పొట్టన పెట్టుకోవాలనే నైజం నేడు బయట పడిందని,  కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరంకు కూడా నీరు పారలేదని అనే వారికి ఒక్క తూము పెట్టి అంతర్గం  చెరువు నుండి చుట్టూ ప్రాంతాల చెరువులు జలకల సంతరించుకున్న జగిత్యాల నియోజకవర్గం లో మీకు కండ్లు కనిపిస్తలేదా? కంటి పరీక్ష శిబిరల్ని ఏర్పాటు చేసి బిజెపి కాంగ్రెస్ నేతలకు కంటి  పరీక్షలు చేయాలి అని కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

రైతు బాగుపడితే చూడలేని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలని, ఇదే కాంగ్రెస్ వస్తే గాదె 3గంటల కరెంట్ ఇస్తారు. రైతు బంధు బంద్ కట్ చేస్తారు అన్నీ సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని అన్నారు. స్థానిక నాయకులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, బీర్ పూర్ రోళ్ళావాగును ఎందుకు పెంచలేక పోయారని ప్రస్నిచారు. కాంగ్రెస్ వస్తే రైతు ఆత్మహత్యలె శరణ్యం, బిఆర్ ఎస్ పార్టీయే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని .. బిజెపి కాంగ్రెస్ ఇద్దరు దొంగలే. దొంగ బాండ్ పేపర్ తోఎంపీ గా గెలిచిన అర్వింద్ నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పసుపు రైతులకు ఎం చేశాడో చెప్పాలని అన్నారు. కల్వకుంట్ల కవిత ఎంపిగా  ఉన్నపుడు నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, రూరల్ ఎంపిపి పాలెపు రాజేంద్ర ప్రసాద్, హెచ్ సిఎ సభ్యడు దావా సురేష్, ఆనంద్ రావు తదితరలు పాల్గొన్నారు.