అధిక పంట దిగుబడులకు పరిశోధనలు అవసరం 

అధిక పంట దిగుబడులకు పరిశోధనలు అవసరం 

వ్యవసాయ యూనివర్సిటీ ఎక్స్ టెన్షన్  డైరెక్టర్ డాక్టర్ వి. సుధారాణి

ముద్ర ప్రతినిధి జగిత్యాల: నాణ్యమైన అధిక పంటల దిగుబడుల కోసం వస్తున్న సమస్యలను అధిరోహిస్తూ ఎప్పటికప్పుడు చేపట్టే పరిశోధనలు చాలా ముఖ్యమని వ్యవసాయ యూనివర్సిటీ ఎక్స్ టెన్షన్  డైరెక్టర్ డాక్టర్ వి. సుధారాణి అన్నారు. జగిత్యాల పొలసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి.

ఈ సమావేశంలో ఉమ్మడి నిజాంబాద్, కరీంనగర్, అదిలాబాద్ పరిశోధన స్థానాలు, ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్రవేత్తలు వ్యవసాయ ఉద్యానవన అధికారులు పాల్గొని 2022 -23 సమస్యలపై పరిగణంలోకి తీసుకొని రాబోయే కాలానికి ఏ విధమైన రీసెర్చ్ చేయాలి అనే అంశాలపై చర్చించారు. అలాగే వాతావరణం మార్పులు తెలంగాణ వ్యవసాయంపై వాటి ప్రభావం, పంటల మార్పులు నేలలపై ప్రభావం, గత వర్షాకాలంలో సాగుచేసిన పంటలు, వేసే పంటల్లో వచ్చిన సమస్యలు, వాతావరణ పరిస్థితులపై చర్చించి రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ఉత్తర తెలంగాణ మండల సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. రాజేశ్వర్ నాయక్, శాస్త్రవేత్త డాక్టర్ ఏ. మాధవి, అర్ ఈ ఏ సీ సభ్యుడు సుంకర  వెంకటేశ్వరరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు ,శాస్త్రవేత్తలు , అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.