రాష్ట్రంలో రైతులు ఏడుస్తున్న పట్టించుకోరా- కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ

రాష్ట్రంలో రైతులు ఏడుస్తున్న పట్టించుకోరా- కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ

మెట్‌పల్లి ముద్ర :-  రాష్ట్రంలో అకాల వర్షాలు,గాలులతో రైతులు పంటలు నష్టపోయి ఏడుస్తుంటే. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం రైతులను పట్టీంచుకోరా అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూర్ గ్రామంలో అకాల వర్షాల కారణంగా వరదల్లో కొట్టుకుపోయిన వరి ధాన్యంను స్థానిక బిజెపి నాయకురాలు జే ఎన్ సునీత వెంకట్ తో కలిసి బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో అకాల వర్షలతో రైతులు అల్లాడుతూ అందోళన చెందుతుంటే  ప్రభుత్వంకు పట్టీంపులేదని, తెలంగాణ సోమ్మును పక్క రాష్ట్రానికి ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం నష్టపోయిన రైతులను గుర్తించి పరిహారం అంచనవేసీ రైతులకు అందచేయాలని డిమాండ్ చేశారు.బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, మండల అధ్యక్షులు బట్టు జకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లేందుల శ్రీనివాస్, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కొడిపల్లి గోపాల్ రెడ్డి, నిజామాబాదు పార్లమెంట్ జాయింట్  కన్వీనర్ గుంటుక సదాశివ్, కోరుట్ల  అసెంబ్లీ కన్వీనర్  సుకెందర్ గౌడ్, నాయకులు యాదగిరి, ఇబ్రహీంపట్నం మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణదిర్, కార్యదర్శి గుండేటి సతీష్, బోడ నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పుస్తెమ్ మహేందర్, రైతులు ఉన్నారు.