రేషన్ షాపుల్లో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలి...

రేషన్ షాపుల్లో నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: చౌక ధరల దుకాణాల్లో లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని జిల్లా ఆదన కలెక్టర్ బిఎస్ లతా అధికారులను ఆదేశించారు. జగిత్యాల అర్బన్ మండలంలోని పలు రేషన్ షాపులను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చౌక ధరల దుకాణాలకు నాణ్యమైన బియ్యాన్ని దిగుమతి చేసుకొని వాటినే పంపిణీ చేయాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు లేని బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో పంపిణీ చేయవద్దని హెచ్చరించారు. డీలర్లు సమయపాలన పాటించి ప్రైస్ బోర్డ్, స్టాక్ బోర్డ్, కంప్లైంట్ బాక్స్ దుకాణాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘించి, నిర్లక్ష్యం వహించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా పౌరసరరాల అధికారి చందన్ కుమార్, డిటి వర ప్రసాద్, ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రావ్ పాల్గొన్నారు.