తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి...

తాళం చెవులు ఎక్కడ ఉన్నాయి...

విచారిస్తున్న ఎన్నికల సంఘం అధికారి..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల సంబంధించి కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జగిత్యాల్లోని విఆర్కే కళాశాలలో గల స్ట్రాంగ్ రూమ్ లో ఎన్నికల పత్రాలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించగా వారం రోజుల క్రితం స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరిచేందుకు జిల్లా అధికారులు ప్రయత్నించగా అవి తేరుచుకోలేదు. ఆ తాళాలు మిస్ అయినట్లుగా అధికారులు ప్రకటించారు.

దీనిపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అలాగే అడ్లురి లక్ష్మణ్ కుమార్ వేరువేరుగా హైకోర్టుకు నివేదించారు. స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ పై సీరియస్ అయిన హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కేంద్రీ ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు అప్పుటి ఎన్నికల అధికారిగా పనిచేసిన అధికారులతో పాటు ఇదివరకు తాళం చేవిలు భద్రపరిచిన కలెక్టర్, అదనపు కలెక్టర్ పిలిపించి విచారణ చేస్తున్నారు.