విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఫై శిక్షణ 

విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఫై శిక్షణ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ఎన్ ఎస్ వి డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్  ఆధ్వర్యంలో  ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్ సెషన్స్ ద్వారా నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టాస్క్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని ఒక సంకల్పంతో శిక్షణ ఇచ్చారు. విద్యార్థి చదువుతోపాటు ఉద్యోగ సాధనకు కావలసిన మెలకువలపైన ప్రత్యేక శిక్షణ అందిస్తూ  కమ్యూనికేషన్స్ స్కిల్స్ టీం వర్క్ లీడర్షిప్ క్వాలిటీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లాంటి నైపుణ్యాలను శిక్షణలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ రిలేషన్షిప్ మేనేజర్ ఐలినేని గంగా ప్రసాద్, కళాశాల చైర్మన్ యాద రామకృష్ణ, అకాడమిక్ డైరెక్టర్ శ్రీపాద నరేష్, ప్రిన్సిపల్ గోపు మునీందర్ రెడ్డి, టాస్క్ కోఆర్డినేటర్ అబ్దుల్ రషీద్, ట్రేనర్స్ శ్రీహరి, ఒమాజీ, విద్యార్థినిలు పాల్గొన్నారు.