అన్నివర్గాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం- మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్

అన్నివర్గాలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం- మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గా లను సమదృష్టితో చూస్తూ వారికి అండగా నిలుస్తోందని జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ అన్నారు. ముస్లింలకు రంజాన్ పండగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ రంజాన్ తోఫా దుస్తులు మక్బర, చౌక్ మజీద్ లలో మున్సిపల్ చైర్మన్ అందజేశారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలోని అన్ని మజీద్ లకు రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా రెండు చెత్త బుట్ట లు, బ్లీచింగ్ పౌడర్ను ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలనే సిఎం కేసిఆర్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. రంజాన్ పండుగ ఏర్పాట్లకు 12.50 లక్షల వెచ్చించి అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అంతరాయం లేకుండ నీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, కూతురు రాజేష్, అర్ ఐ. కజీం, సదర్లు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.