నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు అందజేత

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు అందజేత
  • లయన్స్ క్లబ్, ఎన్నారై బాల్యమిత్రుల సహకారం

ముద్ర,ఎల్లారెడ్డిపేట:కటిక నిరుపేదరికంలో కూరుకుపోయి తల్లి అనారోగ్యంతో మంచాన పడడంతో ఉన్న ఉపాధిని వదులుకొని జన్మనిచ్చిన తల్లి ఆరోగ్యం కాపాడుకోవాలని వచ్చిన ఆకుల వేణు కుటుంబానికి ఆదివారం ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ మెంబర్స్ పయ్యావుల రామచంద్రం, నంది కిషన్, భాస్కర్ రెడ్డి, డాక్టర్ వనం ఎల్లయ్య, మల్లారెడ్డి అదేవిధంగా ఎన్నారై  బాల్యమిత్రుడు బొమ్మ కంటి సతీష్ లు ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు,  50 కేజీల బియ్యాన్ని అందజేసి మానవీయతను చాటుకున్నారు.

ఆకుల వేణు గతంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేశాడు. గత 15 సంవత్సరాల క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాదుకు వెళ్ళాడు. తల్లి అనారోగ్యం బాగాలేదని సమాచారం తెలుసుకున్న ఆకుల వేణు స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేటకు చేరుకొని తల్లికి సేవలు చేస్తున్నాడు.  సమాచారం అందుకున్న విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు అదేవిధంగా తోటి మిత్రులు ఆర్థిక సహాయాలు అందజేస్తున్నారు.