వాస్తవాలు వక్రీకరిస్తున్నది ఎవరు..

వాస్తవాలు వక్రీకరిస్తున్నది ఎవరు..
  • ఇథనాల్ పరిశ్రమ చక్కర కర్మాగారం పునః ప్రారంభంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి...
  • రైతులను మిల్లర్లు దోపిడీ చేస్తున్న ఒక్కరిపైనైనా చర్యలు తీసుకున్నారా...
  •  తప్పులను ఎత్తిచూపితే.. ప్రశ్నిస్తే.. మంత్రికి ఇంత అసహనం ఎందుకు....
  •  ప్రజా జీవితంలో విమర్శలైనా.. సలహాలు.. సూచనలైనా స్వీకరించాలి..  ఎమ్మెల్సీ  జీవన్ రెడ్డి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇథనాల్ ప్రాజెక్టు కావాలా.. చక్కర కర్మాగారం కావాలా.. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టండి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీర్పూర్ మండలంలోని రోళ్లవాగు సమీపంలో ఏర్పాటు చేసిన రాజుల దేవుడు, భీమన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో గురువారం  ఎమ్మెల్సీ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.వరికి ప్రత్యామ్నయ సాగు చేయాలని ప్రభుత్వమే చెబుతుంది.జగిత్యాల అంతర్గాం, రాయికల్, మైతాపూర్, పోరుమల్ల, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం చక్ర సాగు చేపట్టి, గాయత్రి షుగర్స్తో ఒప్పందం కుదుర్చుకొని రవాణా భారాన్ని మోస్తున్నారు. చక్కర కర్మాగారాల పునః ప్రారంభాన్ని ప్రశ్నిస్తే ఇథనాల్ ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని అంటున్నారని అన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఎక్కడైనా జనావాసాల్లో ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. జనావాసాలకు కేవలం 200మీటర్ల దూరంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలనడం మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నాని  అన్నారు.ఇథనాల్ పరిశ్రమతో ప్రయోజనమా.. చక్కర కర్మాగారంతో ప్రయోజనమా ప్రజాభిప్రాయం చేపట్టాలి. వాస్తవాలను ఎవరు వక్రీకరిస్తున్నారో ప్రజలకు తెలుస్తుంది... ప్రజా జీవితంలో సలహాలు, సూచనలు, విమర్శలు వచ్చినా, స్వీకరించాలి.. మంత్రి ఈశ్వర్ ఇంత అసహనానికి లోనుకావడం ఎందుకు... రైతాంగం నిరసనలు, ఆందోళనలు జీర్ణించుకోలేక.. చక్కర సాగు పట్ల రైతులు ఆసక్తి చూపడం లేదని మంత్రి అనడం హాస్యస్పదన్నారు.

 టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మొట్టమొదటి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలోని ప్రధాన సమస్యలను, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను స్వీకరించారు. విద్యుత్ కొరత, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సమస్యలతోపాటు, జగిత్యాల నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను. బోర్నపల్లి వంతెన నిర్మిస్తే అటు ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాంతాలకు సౌకర్యాలు ఏర్పడడంతోపాటు, జగిత్యాల జిల్లాలకు వర్తక, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడంతో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి. బోర్నపల్లి వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు ప్రకటించడంతో బోర్నపల్లి వంతెన ప్రారంభించారు. కొప్పుల ఈశ్వర్ కూడా రోళ్లవాగు ఆధునీకరణ చేపట్టి 0.25 టీఎంసీ సామర్థ్యమున్న రోళ్లవాగును 1 టీఎంసీకి పెంచాలని సీఎం దృష్టికి తీసుకెళ్తే మంజూరుకు చర్యలు చేపట్టారు.రోళ్లవాగు ఆధునీకరణ 2016 మే రూ. 60 కోట్లతో మంజూరు రాగా, దాదాపు 8ఏళ్లు గడుస్తోంది. గతేడాది సాంకేతిక లోపాలు, ప్రకృతి వైపరీత్యాలతో రోళ్లవాగు తెగిపోవడంతో పంట భూములు ఇసుక మేటలు వేసి, రైతులు పంటలు నష్టపోయారు. రోళ్లవాగు, అరగుండాల ప్రాజెక్టుల నుండి కోట్లాది రూపాయల విలువ చేసే మత్స్య సంపద నీటి పాలైంది. రైతాంగాం, మత్స్య కార్మికులు తీవ్ర ఆర్థికంగా నష్టపోయారు.. -సాంకేతిక లోపమైనా, ప్రకృతి వైపరీత్యమైనా, నష్టపోయిన రైతాంగాన్ని, మత్స్య కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.

రొళ్ళవాగు ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో రెండో పంటకు తీవ్ర ఆందోళన చెంది. రైతాంగం రాజకీయాలకు అతీతంగా ఉద్యమించడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి, తాత్కాలిక మరమ్మతులతో రెండో పంటను కొంత మేరకు ఆదుకున్నారు. మత్స్య కార్మికులకు గతేడాది గాని, రాబోయే సంవత్సరం కాని ఏవిధమైన సహాయం. చేపట్టేందుకు చర్యలు చేపట్టలేదు.  రోళ్లవాగు నిర్మాణంలో జాప్యాన్ని ఎత్తిచూపేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తే వాస్తవాలను వక్రీకరిస్తున్నట్లు, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు.
 జీవన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నారు..రోళ్లవాగు ఆధునీకరణ ఆనాడే ఎందుకు చేయలేదంటున్న మంత్రి ఈశ్వర్ అసలు రోళ్లవాగు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. వాస్తవంగా రోళ్లవాగు రాజుల చెరువు అని, కాంగ్రెస్ పాలనలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రూపకల్పనలో రోళ్లవాగును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రూపొందించామన్నారు.  బీర్పూర్ మండలంతో పాటు ధర్మపురిలో కొంతభాగం తాగునీరు, సాగునీరు కల్పించాం. బీర్పూర్ ఫిల్టర్బైడ్ ఏర్పాటు చేసినం. గతపాలకులు ఏమీ చేయలేదని అనడం సరికాదు..వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాకు అంకురార్పన చేసింది ఎవరని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కమ్మునూరు.. కలమడుగు వంతెన నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.. ప్రశ్నించారు.రోళ్లవాగు ఆధునీకరణ పేరిట బీర్పూర్ మండలంలో సిరులు పండించే బంగారు బుగ్గను కనుమరుగు చేశారు. బుగ్గ పరిరక్షణ కోసం అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదో అర్థం కావడం లేదు. -0.25 టీఎంసీ నుండి 1 టీఎంసీ ఆధునీకరణతో అదనంగా 900-1000 ఎకరాలు అటవీ భూమి ముంపుకు గురైంది. అటవీ చట్టాలకు అనుగుణంగా ప్రజావసరాలకు ఆటవీ భూములు తీసుకుంటే ప్రత్యామ్నయంగా రెవెన్యూ భూములు అప్పగించాలి. ప్రత్యామ్నయంగా భూములు ఇవ్వకుండా అటవీ భూములు తీసుకునే అవకాశం లేదు. ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకు ముంపుకు గురవుతున్న అటవీ భూములకు ప్రత్యామ్నయంగా జగిత్యాల జిల్లా భీమారంలో భూమిని సమకూర్చారు.  టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీర్పూర్ మండలంలో గోదావరి తీరానా ఒక్క లిఫ్ట్ అయిన ఏర్పాటు చేశారా అని నిలదీశారు.ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి రైతులు చెల్లించాల్సిన బకాయిలు కూడా రద్దు చేస్తూ, 9గంటల విద్యుత్ సరఫరా చేశారు. - వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సబ్ స్టేషన్ల వారీగా శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.  రైస్ మిల్లర్ల దోపిడీ ఏవిధంగా సాగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. రైతుబంధు నెపంతో వడ్డీ రాయితీ, విత్తన రాయితీ, హమాలీ ఛార్జీలు కనుమరుగు చేశారు. క్వింటాలు 5 కిలోల చొప్పున కోత విధించడంతో రైతు ఎకరానికి రూ.2000 నష్టపోతున్నారు. ఇదేమిటని అడిగినా.. మంత్రి సమీక్ష లేదు.. ఒక్క రెస్ మిల్లర్ పై కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. 

ధర్మకాంట తూకం ఉండగా, ఈ ట్రక్ షీట్ అవసరం ఏమిటో చెప్పాలన్నారు. ఇసుక మేటలు వేసిన భూముల్లో ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చు చేసి, సాగు చేసుకుంటున్నారు. -మత్స్యకార్మికులకు కులవృత్తి సాయం కూడా లేదు. ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్నారు.  రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టేందుకు ధర్మకాంటను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేశ్, జెడ్పీటీసీ పాత పద్మ రమేశ్, ఉపాధ్యక్షుడు బల్మూరి లక్ష్మణ్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుపూరి సుభాష్,  శ్రీమతి జితేందర్,  ఎంపీటీసీ రంగు లక్ష్మణ్, సింగిల్ విండో చైర్మన్. నవీన్ ర్రావు, మండల ఉపాధ్యక్షుడు జోగిరెడ్డి ప్రధాన కార్యదర్శి నారపాక కమలాకర్, రాంలింగారెడ్డి, ఆకుల రాజిరెడ్డి, ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బదినపల్లి శంకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు, బర్రె రాజన్న, శేఖర్, భైరవేని సత్తన్న పాల్గొన్నారు.