న్యాయం చేయాలని.. మృతదేహంతో ఆందోళన..

న్యాయం చేయాలని.. మృతదేహంతో ఆందోళన..

ముద్ర, మల్యాల: కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూ (దొంగల మర్రి ) చేక్ పోస్ట్ వద్ద ప్రధాన రహదారిపై మంగళవారం కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామానికి చెందిన కొందరు మృతదేహం తో ఆందోళన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... చెప్యాల గ్రామానికి చెందిన ఎడవల్లి నరేష్ అనే వ్యక్తి ఇదే గ్రామానికి చెందిన (జగిత్యాలలో నివాసం ఉంటున్న) గోపు రాజిరెడ్డికి చెందిన DCM వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకున్న ఓనర్ ఒత్తిడి మేరకు రెండు రోజుల క్రితం నరేష్ కలకత్తా వ్యాన్ కిరాయి వెళ్ళాడు. ఈ క్రమంలో ఆంధ్ర బార్డర్ సత్తుపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో నరేష్ (డ్రైవర్) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు, నష్టపరిహారం కోసం వ్యాన్ యజమానిని కోరగా, అతను ససేమిరా అనడంతో మంగళవారం ఉదయo అలాగే మృతదేహన్ని ట్రాక్టర్ లో పెట్టుకొని జగిత్యాల ఓనర్ ఇంటికి వెళ్లే ప్రయత్నంలో దొoగలమర్రి చేక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో బాధితులు ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా పెట్టి అక్కడే బైటాయించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే స్థానిక సీఐ రమణామూర్తి, ఎస్ఐలు చిరంజీవి, వెంకట్రావు ట్రాఫిక్ అంతరాయo కల్గకుండా చర్యలు తీసుకోని, బాధితులను రోడ్డు పక్కకు తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వ్యాన్ ఓనర్ ని పిలిపించి, నష్ట పరిహారం ఇచ్చేలా హామీ ఇప్పించడంతో బాధితులు ఆందోళన విరమించి, వెళ్లిపోయారు. కాగా, అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ చొప్పదండి ఇంచార్జి మేడిపల్లి సత్యం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, కొద్దిసేపు ఆందోళనకు మద్దతు తెలిపారు.