జగిత్యాల వాసికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

జగిత్యాల వాసికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: హైదరాబాద్ లో జరిగిన కేసులో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సి ప్రకటించింది. జగిత్యాల పట్టణం, ఇస్లంపురాకు  చెందిన అబ్దుల్ సలీమ్ హైదరాబాదు NIA RC.03/2022/NIA/HYD కేసులో ప్రమేయం ఉన్న నిందితుడిగా ఎన్ఐఏ ఒక ప్రకటన విడుదల చేసింది. సలీం సమాచారం ఇచ్చిన వారికి రూ . 2 లక్షల రివార్డు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

దీంతో ఈ అంశం జగిత్యాల జిల్లాలో చర్చనియంశంగా మారింది. అసలు హైదరాబాదులో ఏమి జరిగింది. కేసు వివరాలు ఏంటి అనే కోణంలో జగిత్యాల పోలీసులు కూడా అరా తీస్తున్నారు. సలీమ్ తో పాటు జగిత్యాల జిల్లాను అనుకోని ఉన్న   నిజామబాద్ జిల్లా కేద్రానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అహద్, ఎపిలోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంకు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ లను ఓకే కేసులు నిధింతులుగా పేర్కొంటూ ఒక్కొక్కరికి రూ. 2 లక్షల రివార్డ్ ను ఎన్ ఐ ఎ ప్రకటించింది.