గంగపుత్రులను అవమానించిన ఎంపీపీ

గంగపుత్రులను అవమానించిన ఎంపీపీ
  • గంగపుత్రుల ఆరోపణ..
  • ఎంపీపీ ఇంటి ముట్టడికి యత్నం..
  • అడ్డుకున్న పోలీసులు...
  • క్షమాపణ చెప్పిన ఎంపీపీ...

మెట్‌పల్లి ముద్ర: గంగపుత్రులను మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయి రెడ్డి అవమానించారని గంగపుత్రులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో కోనరావుపేట, కొండ్రికర్ల గ్రామంలో చెరువు వద్ద నిర్వహించిన ఉత్సవాలలో గంగపుత్రులను కాదని వేరే కులం వారితో గంగపుత్రుల సంప్రదాయ కుల దైవం గంగమ్మ జల పందిరిని వేయించి ఉత్సావాలు నిర్వహించి. గంగపుత్రులను అవమానించారని శుక్రవారం మండలంలోని వెల్లుల్ల గ్రామంలోని ఎంపీపీ ఇంటిని ముట్టడించేందుకు తెలంగాణ రాష్ట్ర గంగపుత్రులు ప్రయత్నించారు దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు గంగపుత్రులకు మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. దీంతో వెల్లుల్ల గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీ ఐ లక్ష్మి నారాయణ గంగపుత్రులను సముదాయించేందుకు ప్రయత్నించిన పలితం లేకుండా పోయింది. ఎంపీపీ సాయిరెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించిన గంగపుత్రులు. ఎంపీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ సాయి రెడ్డి జరిగిన పొరపాటు పై  వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పడంతో ధర్నా విరమించారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎస్ ఐ శ్యామ్ రాజ్ సమక్షంలో పోలీసులు గ్రామంలో బందోబస్తు నిర్వహించారు.