ప్రజా ఆరోగ్యం, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం 

ప్రజా ఆరోగ్యం, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం 

 జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజా ఆరోగ్యం, సంక్షేమమే సియం కేసిఆర్ అబిమతం, తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ జిల్లా లోని గ్రామాలలో అనునిత్యం సానిటేషన్ పనులు చేపట్టి, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని  సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యమును దృష్టియందు ఉంచుకొని వృధా నీరు, మురుగు నీరు నిలిచిపోయి దోమల వలన మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలకుండా, ఈగలు తినే ఆహారము పై వాలడం వలన అనారోగ్యం పాలుకాకుండా నివారించుటకు ప్రజలకు అబ్ది చేకూరేలా అవగాహన పరచి  తగు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో బ్లీచింగ్ పౌడర్ చల్లి, నిలిచిన నీటిని చైర్పర్సన్ స్వయంగా పడవేసి, అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. నిత్యం గ్రామ పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మల్టీ పర్పస్ వర్కర్స్ జీతం రూ. 8500 నుండి రూ.9500 పెంచిన సీఎం కెసిఆర్ కు మల్టీ పర్పస్ వర్కర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశము లో సిఈఓ రామానుజాచార్యులు, డిపిఓ  ఓ.దేవరాజ్, డియం. హెచ్ఓ డా.పి.శ్రీధర్, డా.ఏ.శ్రీనివాస్, జిల్లా మలేరియా అధికారి యం.ఎ.రహమాన్, డి.పి.ఆర్.ఇ శ్రీ జి.శేఖర్ రెడ్డి, ఇ.ఇ, మిషన్ భగీరథ,(ఇంట్రా) , డిప్యుటీ ఇ.ఇ.లు  డి.ఎల్.పి.ఓ, జగిత్యాల అర్బన్ & రూరల్ ఎం.పి.ఓ.లు  పాల్గొన్నారు.