రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలి

రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలి

కలెక్టర్ రాజర్షి షా
ముద్ర ప్రతినిధి, మెదక్: నిరుపేదలకు, ఆర్తులకు వృద్ధులకు, మారుమూల ప్రాంతాలకు రెడ్ క్రాస్ సేవలను విస్తరించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా అధ్యక్షులు, కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం నూతనంగా ఎన్నుకోబడిన మెదక్ రెడ్ క్రాస్ కమిటీ కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే రక్త నిధి కేంద్రాన్ని, వృద్ధులకు ఆశ్రమాన్ని, ఇతర సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి పక్కా భవనానికి ఒక ఎకరం స్థలం కేటాయించాలని మెదక్ జిల్లా చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి కలెక్టర్ కు విన్నవించారు.   కలెక్టరేట్ కాంప్లెక్స్ లో  కేటాయించిన మూడో అంతస్తులోని 301 రూమును ఇప్పించవలసిందిగా కోరగా నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఒక రూమును కేటాయిస్తానని సభ్యులకు హామీ ఇచ్చారు. రక్త నిధి కేంద్రం, వృద్ధాశ్రమాన్ని నిర్మించడానికి తప్పకుండా ప్రయత్నిస్తానని కలెక్టర్ సభ్యులకు హామీ ఇచ్చారు. రెడ్ క్రాస్ సభ్యులు కలెక్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేనేజ్మెంట్ కమిటీ మెంబెర్ సింగం శ్రీనివాసరావు, అనంతరం అదనపు కలెక్టర్
ప్రతిమ సింగ్, రమేష్, ఆర్డిఓ సాయిరాం, ఎస్పి  రోహిణి ప్రియదర్శనిలను కలిసి సన్మానించి, సేవకార్యక్రమాల  నిర్వహణకు సహాయ సహకారాలను కోరారు. ఈ కార్యక్రమంలోవైస్ చైర్మన్ పి.లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శి టి.సుభాష్ చంద్ర బోస్, కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, నిర్వహణ సభ్యులు ప్రభురెడ్డి, దేమే యాదగిరి, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, వి.దామోదర్ రావు,ఎస్ఎల్వివి ప్రసాద్, డాక్టర్ గోవింద్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.