తల్లిపాలు బిడ్డకు అమృతం

తల్లిపాలు బిడ్డకు అమృతం

ముద్ర ప్రతినిధి, మెదక్:తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివని,  పుట్టినబిడ్డకు వెంటనే ముర్రుపాలు తాగించాలని  అంగన్​వాడీ టీచర్లు రేణుక, స్మరణ అన్నారు.  తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మెదక్​ పట్టణంలోని పిట్లంబేస్​–2 అంగన్​వాడీ కేంద్రంలో తల్లులకు, గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపారు.  బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాలని పిల్లలకు రోగ నిరోధక శక్తినిస్తాయని తెలిపారు. కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్​ లక్ష్మీదేవీ, బాలింతలు, గర్భవతులు, అంగన్​ వాడీ చిన్నారులు పాల్గొన్నారు.