34 ఏళ్ళ తర్వాత కలుసుకున్న టెన్త్ పూర్వ విద్యార్థులు

34 ఏళ్ళ తర్వాత కలుసుకున్న టెన్త్ పూర్వ విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట   ఉన్నత పాఠశాలలో చదివిన 1987–88 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. విద్యార్థి దశ ముచ్చట్లు నెమరేసుకున్నారు. స్నేహం, ఆట పాటలు, కష్టం, సుఖం ఇలా ఏదైనా కాని అన్నింట్లో మన వెన్నంటే ఉండీ సపోర్ట్ చేసేది ఒక స్నేహితులు మాత్రమే అని యాదిచేసుకున్నారు.  

మరచిపోనివి, మరుపు రానివి మధుర జ్ఞాపకాలు.  పదో తరగతి తర్వాత దూరమైన అలాంటి స్నేహితులను మళ్లీ 34 ఏళ్ల తర్వాత అందరు ఆత్మీయ సమ్మేళనంగా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కర్రె పోచయ్య, రామ్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, సత్తయ్య, సిద్ధి రాములు,ప్రకాష్, ఎల్లం, పూర్వ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.