నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం వెంకటేశ్వర గార్డెన్స్ లో జరిగిన వివాహ వేడుకలో ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. హవేలీ ఘనపూర్ మండలం తొగిటకు చెందిన ఈగ వెంకట రెడ్డి కుమార్తె, పాపన్నపేట మండలం యూసుఫ్ పేట గ్రామానికి చెందిన టీచర్ వెంకట్రామిరెడ్డి కుమారుడు వివాహంలో పాల్గొన్నారు.  ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెంట హవేలి ఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచులు దేవగౌడ్, యామిరెడ్డి, , లక్ష్మీనారాయణ, నాయకులు నోముల శ్రీకాంత్, వినోద్, సిద్దిరెడ్డి, పార్టీ నాయకుడు అంజిరెడ్డి తదితరులున్నారు