ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్న సివిల్ సర్జన్ డా. శివదయాళ్

ఉత్తమ డాక్టర్ గా అవార్డు అందుకున్న సివిల్ సర్జన్ డా. శివదయాళ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి సివిల్ సర్జన్, గైనకాలజిస్ట్ డా. శివదయాళ్ ఉత్తమ డాక్టర్ అవార్డు అందుకున్నారు. డా. శివ దయాళ్ వైద్యవృత్తిలో ఉంటూ గర్భిణీ మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ.. పేదలకు అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను గుర్తించి ఉత్తమ డాక్టర్ అవార్డును అందజేసింది. ఈ అవార్డును రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివ దయాల్ మాట్లాడుతూ.. ఈ అవార్డు స్ఫూర్తితో పేదలకు నాణ్యమైన వైద్యసేవలను అందిస్తానన్నారు.