ధాన్యం తరలింపులో జాప్యం

ధాన్యం తరలింపులో జాప్యం

రోడ్డెక్కిన రైతులు

ముద్ర ప్రతినిధి: మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులు ఆందోళన  చేపట్టారు. గత వారం రోజులుగా తూకం వేసిన ధాన్యాన్ని తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిపై ముళ్లకంచెవేసి ధర్నా నిర్వహించారు. ఇప్పటికే వరి పంటకు తెగులు సోకి తాము తీవ్రంగా నష్టపోగా మరోవైపు వడగళ్ల వర్షంతో నష్టపోయామని, పండిన కాస్త పంట కూడా కొనుగోలు చేసేందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బస్తాపై అదనంగా ఒక కిలో 300 గ్రాములు తూకం వేసినప్పటికీ లారీల కొరత వల్ల ఎక్కడికి దాన్యం బస్తాలు అక్కడే నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి లారీల కొరత తీర్చి తమ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని రైతుల డిమాండ్ చేశారు.