కురుస్తున్న వర్షాలకు కూలిన రెండు ఇల్లులు

కురుస్తున్న వర్షాలకు కూలిన రెండు ఇల్లులు

రామకృష్ణాపూర్, ముద్ర : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు తిలక్ నగర్ కు చెందిన అమృత,ఐదో వార్డుకు చెందిన గొడిసెల లక్ష్మీ ఇల్లు కూలింది..స్థానిక రెండో వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్,ఐదో వార్డు కౌన్సిలర్ జిలకర మహేష్  మందమర్రి తహసిల్దార్ సంపతి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు విఆర్ఏ రాజు కూలిన ఇంటిని పరిశీలించి పూర్తి నివేదికను అధికారులకు అందించారు. ఈ సందర్బంగా వార్డు కౌన్సిలర్ సుధాకర్,మహేష్ మాట్లాడుతూ ఇల్లు కూలిన అమృత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని అధికారులను కోరారు.