యువతి ఆత్మహత్య

యువతి ఆత్మహత్య

పెద్దశంకరంపేట, ముద్ర: పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన ఉబిత వాగ లక్ష్మీ (19)అనే యువతి నిన్న రాత్రి స్థానిక బతుకమ్మ కుంటలో పడి ఆత్మ హత్య చేసుకుంది.  కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నిన్న కూలి పనికి వెళ్లిన ఆమె మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళి రాత్రికి తిరిగి రాలేదు. ఇంటి సభ్యులు రాత్రి వెతికినా ఆచూకి లభించలేదు. ఉదయం స్థానిక బతుకమ్మ కుంటలో మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.