మెదక్ లో వైభవంగా బోనాల ఉత్సవం

మెదక్ లో వైభవంగా బోనాల ఉత్సవం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ గౌడ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో గ్రామదేవతలకు బోనాల ఉత్సవం అత్యంత వైభవోపేతంగా ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ప్రతి సంవత్సరం రేణుకా మాత  వార్షికోత్సవ బోనాల ఉత్సవానికి ముందు గ్రామ దేవతలకు బోనాలు తీయడం ఆనవాయితీ. పెద్ద గౌడ్ శాంతాగౌడ్ ఇంటి నుండి బోనాల ప్రదర్శన ప్రారంభం కాగా సిద్దిరాములు గౌడ్ పెద్ద బోనం ఎత్తుకున్నారు. పట్టణంలో దాయర, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నవాబుపేట, ఫతేనగర్, పెద్ద బజార్, తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు బోనాలు ఎత్తుకుని ప్రదర్శనగా బయలుదేరారు. పోతరాజుల విన్యాసాల మధ్య బోనాల ఉత్సవం వైభవంగా సాగింది. ఈ ఉత్సవంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్,  దొంతి లక్ష్మి, 
పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గడ్డమీద కృష్ణ గౌడ్, రేణుకా మాత ఆలయ కమిటీ అధ్యక్షులు సురేందర్ గౌడ్, సంఘం ప్రతినిధులు  పాల్గొన్నారు.