ఎమ్మెల్యే పద్మ ఇంటింటి ప్రచారం బోనాలు, బతుకమ్మ, పోతారాజుల స్వాగతం

ఎమ్మెల్యే పద్మ ఇంటింటి ప్రచారం బోనాలు, బతుకమ్మ, పోతారాజుల స్వాగతం

ముద్ర ప్రతినిధి, మెదక్: బిఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ అభ్యర్థి యం. పద్మా దేవేందర్ రెడ్డి చిన్న శంకరంపేట మండలంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  చందాపూర్, మల్లుపల్లి, రుద్రారం,  చందంపేట్ గ్రామాలలో పర్యటించారు.  చందాపూర్ లో  పద్మాదేవేందర్ రెడ్డికి మంగళ హారతులతో  మహిళలు ఘన స్వాగతం పలికారు.

డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలతో హోరెత్తించారు.   పద్మాదేవేందర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

మండలంలోని మండలం మల్లుపల్లిగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డికి మంగళ హారతులు, బతుకమ్మ, బోనాలతో ఘన స్వాగతం పలికారు.  మల్లుపల్లి గ్రామం తెలంగాణ ఉద్యమ సమయంలో మొదటి వరుసలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. మల్లుపల్లిని గ్రామపంచాయతీ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వందేనని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలన్నారు. వెంట స్థానిక జెడ్పిటీసి పట్లోరి మాధవి రాజు, సర్పంచ్లు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలున్నారు.