నేను చనిపోతే నా సమాధి ఇక్కడే చేస్తారు

నేను చనిపోతే నా సమాధి ఇక్కడే చేస్తారు

మరి నిన్ను ఎక్కడ చేస్తారంటు కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డిని  ప్రశ్నించిన తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య లోకల్ వివాదం ముదురుతోంది. నాదంటే లోకల్ ఒకరిని ,నేనే  ఒరిజినల్ లోకల్ అంటూ మరొకరు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్థి తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరి కాస్త ముందుకు వెళ్లి నేను చనిపోతే నన్ను నా స్వగ్రామం తాండూర్ నియోజకవర్గం ఇందర్చెడ్ గ్రామంలో   సమాధి చేస్తారు. నిన్ను ఎక్కడ పెడతారంటు కాంగ్రెస్ అభ్యర్థి మహి మనోహర్ రెడ్డిని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు.
నాది తాండూర్ సొంత నియోజకవర్గం.అందుకే మన బాధలు మనకు తెలుస్తాయి, బయటోనికి ఏం తెలుసు..బయటోన్ని నమ్మితే ఆగం అవ్వుడు ఖాయం.నాపై ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల ఆశీర్వాదం నాపై ఉంది.. కర్ణాటక ప్రజల్లాగా మనం మోసపోవద్దు..కాంగ్రెస్ పార్టీ 6 భరోసాలు మోసపూరితమని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.
 తాండూరు పట్టణంలోని 6 వార్డుకు చెందిన మహిళాలు శని వారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరిన సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పై విధంగా మాట్లాడారు.