వికారాబాద్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అలర్ట్

వికారాబాద్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు అలర్ట్
Vikarabad Collector orders

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: దరిని సమస్యలకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ తాసిల్దార్లకు, మీసేవ నిర్వాహకులకు ఈ క్రింద సూచించిన ఆదేశాలు జారీ చేశారు.

1. ప్రతి తహశీల్దార్ కార్యాలయం లో ఇప్పటి నుండి ధరణి సహాయ కేంద్రం విధిగా ఏర్పాటు చేయాలి. 
2. తహశీల్దార్ కార్యాలయం లో ఉన్న ధరణి సహాయ కేంద్రం లో రెవెన్యూ మరియు ధరణి పోర్టల్ పైన అవగాహన కల్గిన ఒక ఉద్యోగిని నియమించాలి.ఇట్టి ఉద్యోగి వచ్చిన దరఖాస్తుదారులకు  ధరణి సమస్యల పై ఉన్న సందేహాలను నివృత్తి చేసి అతని యొక్క సమస్య  పరిష్కరించదగినదా లేదా సివిల్ తగాదా కిందికి వస్తుందా  అనే విషయాన్ని తెల్సుకునేలా చేసి పరిష్కరించదగిన సమస్యలను ధరణి పోర్టల్ లో గల వివిధ మాడ్యూల్స్ లో కావాల్సిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధంగా ధరఖాస్తుదారునికి తగిన సూచనలు అందించాలి . సివిల్ దావాలు కిందికి వచ్చే సమస్యలను ఆయా సివిల్ కోర్టులో పరిష్కరించుకునే విధంగా సూచించాలి.వీలైనంత వరకు అనవసరమైన మరియు పరిష్కారం కాని దరఖాస్తుదారులను ధరణిలో అప్లై చేసి డబ్బులు వృధా చేసుకోకుండా  సూచించాలి.


3. ప్రతి తహశీల్దార్ మీడియా ప్రకటన ద్వారా ధరణి హెల్ప్ డెస్క్ ఏర్పాటు  అయిన విషయాన్ని ప్రజలందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ విషయం ను విస్తృతంగా ప్రచారం అయ్యేలా వివిధ సోషల్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బహుళ ప్రచారం పొందేలా చూడాలి. అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు మరియు  రైతు బంధు సభ్యుల సహకారాన్ని కూడా తీసుకోవాలి.
4. ప్రతి సోమవారం తహశీల్దార్ కార్యాలయం నందు ధరణి ఫిర్యాదుల విషయమై  ప్రజావాణి ఏర్పాటు చేయవలెను. తహశీల్దార్ ఉదయం 10.30 గంటల నుండి  మధ్యాహ్నం 2.00 గంటల వరకు ధరఖాస్తులను స్వయంగా స్వీకరించాలి. తహశీల్దార్ ఆఫీస్ లో గల ధరణి ఆపరేటర్ సహాయం తో ధరణి పోర్టల్ లో ప్రస్తుత స్థితిని కనుగొని ప్రస్తుతం ఆ భూమి రెవిన్యూ రికార్డ్స్ ఆధారంగా దరఖాస్తు దారునికి సరియైన ధరణి మోడ్యూల్ లో అప్లై చేసే విధంగా  ఆ అప్లికేషన్ పై సరియైన రిపోర్ట్ ని వెంటనే కలెక్టర్ ఆఫీస్ కి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి ,సివిల్ డిస్ప్యూట్స్ కి సంబంధించిన  తగాదాలను సరియైన రీతిలో సివిల్ కోర్టులో పరిష్కరించుకునే విధంగా సూచించాలి తప్ప వారిని పరిష్కరించే అధికారంలేని సమస్యలపై ఆఫీసుల చుట్టూ తిరగకుండా స్పష్టతను ఇవ్వాలి.


5. ప్రతి మీ-సేవ కేంద్రం యందు ధరణి  హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయించాలి.
 మీసేవ సెంటర్ లో ధరణి పోర్టల్ పైన అవగాహన కల్గిన ఆపరేటర్ మీసేవ సెంటర్ యజమాని నియమించుకోవాలి . ఏవి పరిష్కారం అవుతాయి ఏవి పరిష్కారం కావు అనే విషయం లో తగు సూచనలు సలహాలు తెలియజేసి , అధికారుల చే పరిష్కారం అయ్యే వాటిని ధరణి పోర్టల్ లో అప్లై చేసే విధంగా  అధికారుల పరిధిలో లేని సివిల్ డిస్ప్యూట్స్ కేసులని సరియైన సివిల్ కోర్టులో పరిష్కరించుకునే విధంగా సూచించాలి.


6. తహశీల్దార్ మీసేవ ఆపరేటర్స్ తో ఒక సమావేశం ఏర్పాటు చేసి ధరణి పోర్టల్ లో ఉన్న వివిధ అంశాల పైన సూచనలు ఇవ్వాలి మరియు మీసేవ సెంటర్ కి వచ్చిన రైతులకు తగు సూచనలు ఇచ్చేలా చూడాలి .

7. స్థూలంగా ధరణి సమస్యల పరిష్కారానికి  ప్రతి తహశీల్దారు సమస్యల సత్వర పరిష్కారం చెందేలా చొరవ తీసుకోవడం అత్యంత ప్రధానమైన అంశంగా పరిగణించాలి .ఇట్టి విషయమై వారు తమ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ధరణి హెల్ప్ డెస్క్ మరియు మీసేవ కేంద్రాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా    రైతుల సమస్యలను శీఘ్ర గతిన పరిష్కరించుకునేలా రైతులకు తగు సూచనలు చేసి సరియైన రిపోర్టులు కలెక్టర్ ఆఫీస్ కు సమర్పించి రైతుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలి