నాకొడుకు పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి - జెడ్పీటీసీ ప్రమోదిని

నాకొడుకు పైలెట్ రోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి  - జెడ్పీటీసీ ప్రమోదిని

బీఅర్ఎస్ కు భారీ మెజారిటీ ఖాయం 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: యాలాల మండలం నుండి బీఅర్ఎస్ కు భారీ మెజారిటీ ఖాయం అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మాతృమూర్తి వికారాబాద్ జెడ్పీటీసీ ప్రమోదిని  అన్నారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం రాఘవాపూర్, కమాలపూర్, నాగసముందర్ గ్రామాల్లో ఈరోజు ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులు, యువకులతో ఆమె సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆమె వారికి వివరించారు. బీఅర్ఎస్ పార్టీ మానిఫెస్టో తో ఆయా వర్గాలకు జరగనున్న లబ్ధిని ఆమె తెలియజేశారు. వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమని తాండూరులో మళ్ళీ గెలిచేది రోహిత్ రెడ్డి అని అన్నారు.