కాంగ్రెస్ వస్తే అన్ని పథకాలు కట్

కాంగ్రెస్ వస్తే అన్ని పథకాలు కట్
  • అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ ను గెలిపించాలి 
  • తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
  • పెద్దముల్ లో ప్రజా ఆశీర్వాద సభ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: బయటోనికి ఓటు వేస్తే ఆగం అవుతారు ప్రజలు తమ బాగోగులు పట్టించుకునే నాయకుల్ని గెలిపించాలి..కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలా? అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు. 

 పెద్దేముల్ మండలంలో పైలెట్ ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఈరోజు మండల పరిధిలోని కందేనెల్లి గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని పక్క రాష్ట్రం కర్ణాటకలో కళ్ళారా చూస్తున్నామని అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబందు లాంటిదని రైతు బంధు ఇచ్చి రైతును రాజును చేసింది ముఖ్యమంత్రి కేసిఆర్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వస్తే అన్ని పథకాలు కట్ అవుడు ఖయం అని అన్నారు. గులాబీ జెండా ప్రజలకు అండాగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి మళ్ళీ బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలని కోరారు.. బయటోనికి ఓటు వేస్తే ఆగం అవుతాం ఆలోచించి ఓటు వేయాలని కోరారు.