రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

రామానుజుల విగ్రహాన్ని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

చిన జీయర్ స్వామి తో భేటీ.. వివిధ అంశాలపై చర్చ

రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో రామానుజుల విగ్రహాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా పలువురు స్వామీజీలు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం త్రిదండి చిన జీయర్ స్వామితో కలిసి రామాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపు చిన జీయర్ స్వామి తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. స్వామీజీలు మోహన్ భగవత్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిన జీయర్ స్వామి ఆయనకు దేవతా మూర్తుల జ్ఞాపికలను అందజేశారు.