కోదాడ మాజీ ఎంపిపి కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత

కోదాడ మాజీ ఎంపిపి కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత

ముద్ర ప్రతినిధి , కోదాడ: సూర్యాపేట జిల్లా, కోదాడ మండలం, గుడిబండ గ్రామంలో మాజీ ఎంపిపి ఇంటి ముందు నాయి బ్రాహ్మణుల ధర్నాచేస్తున్న నాయి బ్రాహ్మణులు. సర్వే నెంబర్ 452 లో 1 ఎకరం 7 కుంటల భూమి ఆక్రమించిందని ధర్నాకు దిగిన నాయి బ్రాహ్మణులు , గతంలో ప్రభుత్వాన్ని , అధికారాన్ని అడ్డు పెట్టుకొని తమ భూమిని ఆక్రమించింది ఆరోపిస్తున్న నాయి బ్రాహ్మణులు. మాజీ ఎంపిపి కవిత అనుచరులు , నాయి బ్రాహ్మణులు పరస్పరం ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు .

మాకు న్యాయం చేసే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని టెంట్ వేసి ధర్నా చేస్తున్న నాయి బ్రాహ్మణులు. ఇప్పటికే వివాదంలో ఉన్న స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి , నిర్మాణం చేపట్టిన మాజీ ఎంపిపి , గత ప్రభుత్వంలో అధికారులను , ఎమ్మెల్యే ను , పోలీసులను అడ్డు పెట్టుకొని తమను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసిందని నాయి బ్రాహ్మణుల ఆరోపణ . మా పూర్వీకుల నుండి ఈ స్థలం తమ ఆధీనంలోనే ఉందని , ధరణి లో కూడా తమ పేరనే ఉందని , ఇప్పటికి తమ పేరే రికార్డులలో వస్తుందని చెప్తున్న నాయి బ్రాహ్మణులు.

వివాద స్థలం వద్దే వంట వార్పూ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్న నాయి బ్రాహ్మణులు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోదాడ రూరల్ పోలీసులు , కోదాడ రూరల్ సిఐ రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు . వివాదంలో ఉన్న స్థలం వద్దకు చేరుకున్న తహశీల్ధార్ సాయ గౌడ్ . ఇరువురి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇరు వర్గాలు , గ్రామస్తులు.