కలెక్టరేట్ కార్యాలయానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలి

కలెక్టరేట్ కార్యాలయానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు నామకరణం చేయాలి
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి జగదీష్ రెడ్డి కి ఎం సి పి ఐ యు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న విజ్ఞప్తి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు స్వాతంత్ర సమరయోధులు మాజీ శాసనసభ పార్లమెంటు సభ్యుడు రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఎం సిపిఐ యూ పోలిటి బ్యూరో సభ్యులు అమరజీవి భీమిరెడ్డి నరసింహారెడ్డి  పేరు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి నామకరణం చేయాలని ఏం.సిపిఐయు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న మంత్రి జగదీష్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ లింగంపల్లి రాజు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశము నిర్వహించారు. ఈనెల 10వ తేదీన గుండెపోటుతో ఆకస్మిక మరణించిన ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పరికరాల భూమయ్య  మృతి పట్ల  రెండు నిమిషాలు మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి  జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

మన సూర్యాపేట జిల్లా కేంద్రంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన బి.యన్.రెడ్డి  తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించి అఖిలభారత కమ్యూనిస్టు ఉద్యమ నేతలలో ఒకరుగా గుర్తింపు పొంది తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి తన తండ్రి తన  పంచి ఇచ్చిన ఆస్తిని  సైతం ప్రజలకు పంచిపెట్టిన ఆదర్శమూర్తి కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచారని తెలిపారు.  రెండుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు ఎంపీగా 25 సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఎన్నికై అసెంబ్లీ పార్లమెంట్లో తన యొక్క కంచు కంటాన్ని ప్రభుత్వానికి వినిపించి ప్రజలకు సాగునీరు త్రాగునీరు గోదావరి నది జలాలు పంట పొలాలకు అందించాలని పరితపించిన వ్యక్తి అన్నారు.  అందుకే నూతనంగా నిర్మించిన  కలెక్టరేట్ కార్యాలయానికి భీమిరెడ్డి  పేరు నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ నజీర్, ఏష బోయిన సుధీర్, మురపాక ఉగ్రయ్య, బచ్చుకోటయ్య, వేముల పెద నర్సయ్య, నలుగురి రమేష్ ఏపూరి సోమన్న, లింగంపల్లి ఓంకార్, సైదులు పాల్గొన్నారు.