నూతన పీఆర్సీ ని ఏర్పాటు చేయాలి

నూతన పీఆర్సీ ని ఏర్పాటు చేయాలి

  • టిపియుయస్ ఆధ్వర్యంలో ఉద్యమ జాగరణ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమం

ముద్ర ఆత్మకూరు (ఎస్):-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు  నూతన వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ని ఏర్పాటు చేసి తక్షణమే మధ్యంతర భృతిని ప్రకటించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యామా రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  టిపియుయస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆత్మకూరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జూలకంటి వెంకట్ రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డిల  ఆధ్వర్యంలో మండలం లోని పలు ప్రభుత్వ  పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనైనది.  ఈ సందర్భంగా యామా రమేశ్ మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కరించి  పాఠశాల విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని, నూతన పీఆర్సీ కమిటీని వేసి, మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని డి.ఏలను వెంటనే విడుదల చేయాలని, సి.పి.ఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు అవకాశం కల్పించాలని, కే.జీ.బీ.వీ ఉపాధ్యాయినిల, మోడల్ స్కూల్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులను నియమించాలని కోరారు.  సభ్యత్వ నమోదులో భాగంగా మండలం లోని కోటి నాయక్ తండా, కాలేభావ్ సింగ్ తండా, పాత సూర్యాపేట, నెమ్మికల్, ఆత్మకూరు, ఏవీకే తండా తదితర గ్రామాల్లోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాధమిక, కేజీబీవీ, మోడల్ స్కూల్ లను సందర్శించి ఉపాధ్యాయులకు టిపియుయస్ ఉద్యమ కార్యాచరణ ను తెలియచేసి సభ్యత్వాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపియుయస్  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి హరిప్రసాద్ , జిల్లా కార్యదర్శి పోతుగంటి శ్రీనివాసా చారి, భాగ్య లక్ష్మి, సరస్వతి, షర్మిల, చంద్రకళ, సునీల్, గురు చరణ్, నీరజ, రంగయ్య, ఫర్హీన్, రజిత, హేమలత, యాదమ్మ, శిరీష, నాగలక్ష్మి, ప్రభాకర్ , శ్రీనివాస్, కృష్ణవేణి, గీతాంజలి, సుమలత తదితర ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.