అట్టహాసంగా ఆడంబరంగా అంగరంగ వైభవంగా మాంగళ్య  15వ షాపింగ్ మాల్ సూర్యాపేటలో ప్రారంభం

అట్టహాసంగా ఆడంబరంగా అంగరంగ వైభవంగా మాంగళ్య  15వ షాపింగ్ మాల్ సూర్యాపేటలో ప్రారంభం
  • షాపింగ్ మాల్ లో జ్యోతి ప్రజ్వలన చేసి సందడి చేసిన సినీనటి రాశి కన్నా
  • షాపింగ్ మాల్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు బడుగుల  లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
  • ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, హీరో షోరూం అధినేత వాసవియన్ రాచర్ల కమలాకర్ వ్యవస్థాపకులు, యాజమాన్యం పుల్లూరు అరుణ్ కాసం నమశ్శివాయ, కాసం మల్లికార్జున్ కసం కేదారినాథ్ కాసం శివప్రసాద్ కార్తీక్ వరుణ్ విశాల్ బొట్ల రవీంద్రనాథ్ తదితరులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-వస్త్ర ప్రపంచంలో పేరెన్నికగన్న మాంగల్య షాపింగ్ మాల్ 15వ బ్రాంచ్ ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం అట్టహాసంగా ఆడంబరంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మాంగల్య షాపింగ్ మాల్ లో సినీ నటి రాశి కన్నా జ్యోతి ప్రజ్వలన భావించారు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణలు షాపింగ్ మాల్ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సినీ నటి రాశి కన్నా ఎంపీ బడుగుల లింగ యాదవ్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాల సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ హీరో షోరూం అధినేత రాచర్ల కమలాకర్ షాపింగ్ మాల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ లేటెస్ట్ డిజైన్లకు సరసమైన ధరలకు మాంగల్య షాపింగ్ మాల్ పెట్టింది పేరు అని అన్నారు నగరంలో దొరికే అన్ని రకాల వస్త్రాలు డిజైన్లు నేడు సూర్యాపేటలో కూడా మాంగల్య షాపింగ్ మాల్ లో సరసమైన ధరలకు లభిస్తాయని చెప్పారు జయ ప్రయాసలకు ఓర్చి వందలాది కిలోమీటర్లు ప్రయాణించి తీవ్రంగా శ్రమించి షాపింగ్ చేయాల్సిన అవసరం ప్రస్తుతం సూర్యాపేట ప్రజలకు లేదని సూర్యాపేటలోనే మాంగళ్య షాపింగ్ మాల్ అన్ని రకాల వస్త్రాలను చిన్నారుల నుంచి పెద్దల వరకు కావాల్సిన అన్ని రకాల ఆధునిక డిజైన్లను అందిస్తుందని చెప్పారు కస్టమర్ల డబ్బుకు సరిపడా విలువనిచ్చి అందుకు తగ్గట్టుగా నాణ్యమైన వస్త్రాలను మాంగళ్య షాపింగ్ మాల్   రెండు రాష్ట్రాల్లో ఉన్న షోరూంలో ద్వారా వినియోగదారులకు అందించి వారి ఆదరాభిమానాలు ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపార రంగంలో రాణించి ప్రజలకు మరింత చేరువలో కావలసిన అన్ని రకాల శుభకార్యాలకు అన్ని వెరైటీలను అందిస్తుందని వివరించారు. సినీనటి రాశి కన్నాను చూడడానికి అభిమానులు జిల్లా ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు షాపింగ్ మాల్ ప్రారంభం రోజు అద్భుతమైన ఆఫర్లు షోరూంలోని అన్ని అంతస్తుల్లో కూడా కస్టమర్లతో  కిటకిటలాడాయి. ఇంకా ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పట్టణ ప్రముఖ వ్యాపారస్తులు గండూరి శంకర్ గండూరి కృపాకర్, ఇండియన్ గ్యాస్ అధినేత తోట శ్యాం ప్రసాద్ కౌన్సిలర్ సాగర్ రెడ్డి దిలీప్ రెడ్డి, మద్దిపాటి శ్రీను ఊరగాయత్రి టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నీడ్స్ నగేష్ ఇతర వ్యాపారులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.