మరింత భాద్యతగా పనిచేస్తా

మరింత భాద్యతగా పనిచేస్తా
  • వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే
  • రాబోయే ఎన్నికలలో 4 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి
  • రెండవసారి డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన చెవిటి వెంకన్న యాదవ్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట

మరింత భాద్యతగా పనిచేస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రo లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేoడోవసారి డీసీసీ అధ్యక్షుడిగా చెవిటి వెంకన్న యాదవ్ ఎన్నికైన సందర్బంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి అంజాద్ అలీ,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైరు శైలేందర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా  చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ తన పై నమ్మకం ఉంచి రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి, పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి,పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు,మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి,కోదాడ మాజీ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.తనపై పూర్తి విశ్వాసంతో రెండోసారి అధిష్ఠానం జిల్లా అధ్యక్షుడిగా నియమించిందని, దీంతో  తనపై బాధ్యత మరింత పెరిగిందని పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరింత భాద్యతాయుతంగా పని చేసి పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటందుకు పార్టీ పటిష్టతకు కృషిచేస్తానని తెలిపారు.నఎన్నో ఒడిదొడుకులు వచ్చిన ఎదుర్కొని క్రమశిక్షణను కాంగ్రెస్ పార్టీ నేర్పించిందని తెలిపారు.

నిత్యం కార్యకర్తలతో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సమస్య పరిష్కార దిశగా పనిచేశానని అన్నారు.నాటినుంచి జిల్లాలో కాంగ్రె స్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నానని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు జిల్లాలో పోరాటాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపామని అన్నారు. చెవిటి వెంకన్న యాదవ్ నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ కార్యకర్తలు చెవిటి వెంకన్న యాదవ్ ని ఘనంగా సన్మానిoచ్చారు.ఇంతకు ముందు తనకు సహకారం అందజేసిన మండల,బ్లాక్, అధ్యక్షులకు జిల్లా కార్యవర్గానికి,పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు