కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి-యం పి పి పార్వతి కొండా నాయక్ 

కంటివెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి-యం పి పి పార్వతి కొండా నాయక్ 

ముద్ర ,మఠంపల్లి : కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న అన్నివర్గాల శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణా రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని ప్రతి ఒక్కరూ ఈయొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మఠంపల్లి యం పి పి మూడవత్ పార్వతి కొండా నాయక్ అన్నారు.

బుధవారం మఠంపల్లి మండలంలోని అవరేణి కుంటా తండాలో రెండవ విడత కంటి వెలుగు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కళ్ళ అద్దాలు, మందులను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో యం పి డి ఓ మామిడి జానకి రాములు,సర్పంచ్ బానోతు విజయ,యం పి ఓ ఆంజనేయులు, ఉప సర్పంచ్ బానోతు చీనా నాయక్,పంచాయతీ కార్యదర్శి పుణేశ్వరి,వైద్యులు, సిబ్బంది,ఆశా కార్యకర్తలు,అంగన్ వాడి సిబ్బంది పాల్గొన్నారు.