ప్రచారంలో కారు గేరు మార్చి స్పీడ్ పెంచిన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

ప్రచారంలో కారు గేరు మార్చి స్పీడ్ పెంచిన తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
  • బిఆర్ఎస్ లో చేరికలతో విపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఎమ్మెల్యే
  • అన్ని వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్  కుమార్  ప్రచార పర్వంలో కారు గేరు మార్చి స్పీడ్ పెంచారు.  బిఆర్ఎస్ పార్టీ  ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ప్రచారంలో దూకుడు మరింత పెంచింది .ఎమ్మెల్యే గతానికి భిన్నంగా  తన బలాన్ని మరింత పెంచుకునేందుకు విపక్ష పార్టీల బలాల పై దృష్టి సారించారు .గ్రామాల్లో, మండలాల్లో బలమైన నాయకులు ,కార్యకర్తలను  బి ఆర్ ఎస్   లోకి ఆహ్వానించి క్యాడర్ను బలోపేతం చేస్తున్నారు .ఎన్నికల సమరానికి ముందే తన బలగాలను మండలాల్లో, గ్రామాల్లో మోహరించి  ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరైనా సరే ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. విపక్ష పార్టీల కార్యకర్తల నాయకుల చేరికలతో అవతలి పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఎమ్మెల్యే ఎంత పకడ్బందీగా ఈసారి బరిలో దిగనున్నాడో అర్థమవుతుంది .9 మండల పార్టీ అధ్యక్షులకు అలాగే అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులను అప్రమత్తం చేసి శతవిధాల ప్రయత్నాలు చేసి చేరికలు నిరంతరం సాగేలా చర్యలు   చేపట్టారో  జరుగుతున్న పరిణామాలే ఉదాహరణగా తీసుకోవచ్చు.

ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే బహుముఖ వ్యూహం అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గత రెండుసార్లు ఏ ఏ పొరపాట్లు జరిగాయా సరిచూసుకోవడంతోపాటు ఈసారి చిన్న పొరపాటు లేకుండా ప్రత్యర్థిని మట్టి కరీపించడానికి సన్నద్ధమవుతున్నారు. సంక్షేమ పథకాలతో కొంత ,అలాగే గ్రామాల్లో అభివృద్ధి పనులతో కొంత, పార్టీలో ప్రాధాన్యత కల్పించే దిశగా కొంత ,ఆర్థిక సర్దుబాట్లు పేద బడుగులపై ప్రత్యేక దృష్టి ,కుల సంఘాలు వివిధ పక్షాల నేతలతో సమావేశాలు, అలాగే ప్రభుత్వంతో సంబంధం ఉన్నవారితో సమావేశాలు ,ఇలా అనేక రకాల వ్యూహాలతో గణనీయంగా ఓట్ల శాతం పెంచడానికి ఎమ్మెల్యే తీవ్రంగా కృషి చేస్తున్నారు .ఎమ్మెల్యే అనుసరిస్తున్న వ్యూహాలు అనుకున్నట్లుగా సఫలమైతే ప్రత్యార్ధికి భంగపాటు తప్పదు అనేది పలువురి మాట. నియోజకవర్గం లోనే మకాం వేసి ప్రజల మధ్యనే ఉంటున్న తీరే ఎన్నికలపై ఎమ్మెల్యే పట్టుదల ఏంటో చెబుతోంది. అలాగే వందలాది మందిని తన నివాసంలో ఉదయం సాయంత్రం ములాకత్ కార్యక్రమంతో పలకరిస్తూ వారి సమస్యలు వింటూ సాధ్యమైనంతవరకు పరిష్కరిస్తూ పరిచయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే మరింత పెంచిన దూకుడుతో అభ్యర్థులే ఖరారు కానీ విపక్షాలు అభ్యర్థుల వేటలోనే మునిగి తేలుతున్నారు. రానున్న కాలంలో అభ్యర్థులు తేలే వరకు విపక్ష పార్టీలు చేసేదేమీ లేకపోవచ్చు .ఎమ్మెల్యే వ్యూహం ఫలించి బలగం బలం  ఏమేరకు పెరుగుతుందో వేచి చూడాల్సిందే.