ప్రమాదకరంగా మారిన రాయచుర్ గద్వాల్ రహదారి

ప్రమాదకరంగా మారిన రాయచుర్ గద్వాల్ రహదారి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: కేటి దొడ్డి పోలీస్ స్టేషన్ కూతవేటి దూరంలో ప్రమాద అంచున రహదారి కేటి దొడ్డి మండల కేంద్రంలోని గద్వాల్  టూ రాయచూర్  ప్రధాన రహదారి మరియు మండల పోలీస్ స్టేషన్ కూతవేటి దూరంలో కల్వర్టు గోడ కూలి ప్రమాద భరితంగా మారిన రహదారి. రోజుకు ఎన్నో వేల  వాహనాలు అదే రహదారిన ప్రయాణం సాగిస్తూ ఉంటారు. కానీ ఏదైనా ప్రమాదం అదుపు తప్పి కింద పడితే ప్రాణాలే పోయే అవకాశం.

ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రయాణికులకు ప్రయాణించేటప్పుడు ప్రమాద రహదారి దగ్గర కొంచెం అదుపు తప్పిన ప్రాణాలు గాల్లో కలిసి పోయే అవకాశాలు ఉన్నాయి. కావున ఆర్ అండ్ బి అధికారులు పోలీస్ అధికారులు స్పందించి, ఆ ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు గోడను నిర్మించాలని వాహనదారులు  అధికారులను కోరుకుంటున్నారు. అలాగే రహదారి పై ఉన్న గుంతలను కూడా పుడిచివేయాలని కోరుకుంటున్నారు.