ఈత సరదా విషాదం కాకూడదు

ఈత సరదా విషాదం కాకూడదు

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల, చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి. ఈత వచ్చిన కుటుంభ సభ్యుల సంరక్షణ లోనే  చిన్నారులు బావులు,  చెరువులు, కాలువలు, కుంటల దగ్గరకు వెళ్లాలి. జిల్లా ఎస్పీ కె. సృజన, వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   జలాశయాల వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణలు కోల్పోయో ప్రమాదం ఉందనీ తద్వారా  ఈత సరదా కుటుంబంలో విషాదాన్ని నింపే అవకాశం వుందని కావున ఈత సరదా విషాదం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని. జిల్లా ఎస్పీ కె. సృజన, జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత ను నేర్చుకునే చిన్నారులు, యువతి యువకులు   ఈత వచ్చిన వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యoగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, మహిళలు బట్టలు ఉతికేoదికు చెరువుల దగ్గరకు కుడా ఈత వచ్చిన కుటుంబ సభ్యుల వెంట మాత్రమే వెళ్ళాలని అన్నారు. అదేవిధంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామ పోలీస్ అధికారుల ద్వారా గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల ద్వారా యువకులు ఈతకు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పిస్తున్నామని, మరియు జలాశయాల వద్ద హెచ్చరిక  సూచికలను ఏర్పాటు చేయడo జరుగుతోందనీ, జిల్లా లో ప్రతి రోజూ ఒక గ్రామంలో కళా బృందంతో కుడా రానున్న కాలంలో ఎటువంటి ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకుండా అవగాహాన కల్పిస్తున్నామని జిల్లా ఎస్పీ. తెలిపారు.