దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నిరసన..

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాల నిరసన..

అధికారులకు ఫిర్యాదు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. మొగుళ్లపల్లి మండల రిపోర్టర్ రాజు పై సోమవారం కొందరు దాడి చేసి, హత్యాయత్యానికి పాల్పడటం జరిగింది. ఈ విషయంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లా కేంద్రంలో పలు నినాదాలు చేస్తూ, నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు కలెక్టర్ దివాకర కు ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నేతలు సామంతుల శ్యామ్, క్యాతం సతీశ్,  చింతల కుమార్ యాదవ్, సామల శ్రీనివాస్, జల్దీ రమేష్, బొడ్డు వంశీ, అంబాల సంపత్, కడపాక రవి, పావుశెట్టి శ్రీనివాస్, పసుల రాజు, ఎడ్ల సంతోష్, ఎర్రం సతీష్, టివి సమ్మయ్య, పల్నాటి రాజు, బండారి రాజు, కాసోజు రంజిత్, రజినీకాంత్,  పృద్వి, సతీష్ , సుమన్, పవన్, తోట శ్రీనివాస్, రవి, శ్రీశైలం, ఇమ్రాన్ ,చందు, రాజు, బొల్లేపల్లి జగన్, సత్యనారాయణ, రాచర్ల ప్రభాకర్, సమ్మయ్య గౌడ్, సాంబయ్య, రజనీకాంత్ పాల్గొన్నరు.