తెలంగాణాలో కుటుంబ పాలనను అంతం చేయాలి - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు
ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణాలో కుటుంబ పాలనను అంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మండలం కొంపెల్లి, కొంపెల్లితండా, మోరంచపల్లి తదితర గ్రామాలలో ఆదివారం ప్రజా దీవెన యాత్రను చేపట్టిన గండ్ర సత్యనారాయణ రావు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదేళ్లుగా నిరంకుశ కుటుంబ పాలన నడుస్తోందని, ఈ ఎన్నికల్లో ఆ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని, అందుకే ప్రజలు ఆ పార్టీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మోసపూరిత హామీలతో వస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మలేరని అన్నారు. డబ్బు సంచులు, మద్యం సీసాలతో మీ ముందుకు వస్తున్న వారికి మీ ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో నన్ను ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే, మీకు సేవకుడిగా పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ నర్సింహారెడ్డి, చాడ రఘునాథ్ రెడ్డి, వైయస్సార్టీటిపి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తదితరులు