ఎన్నికల అధికారుల ఆకస్మిక తనిఖీలు

ఎన్నికల అధికారుల ఆకస్మిక తనిఖీలు

హుజూర్ నగర్ ముద్ర: హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ప్రమోద్ కుమార్ ఐఆర్ఎస్ లు పట్టణంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం నందు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా పోటీ చేసిన అభ్యర్థుల ప్రచార ఖర్చులకు సంబంధించి వారు చేసినటువంటి అన్ని విధముల ఖర్చులను అభ్యర్థుల ఖర్చు రిజిస్టర్ నందు విధిగా నమోదు చేయవలసిందిగా సూచన చేయడం జరిగింది. అలాగే క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలలో టీవీలలో మూడుసార్లు తమ కేసుల గురించి తప్పనిసరిగా ప్రచురించి ఆ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని కోరడం జరిగినది తదుపరి పట్టణంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తనిఖీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమాల్లో రిటర్నింగ్ అధికారి ఎన్ జగదీశ్వర్ రెడ్డి  బి కృష్ణ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది