బీఎస్పీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులుగా కృష్ణ నియామకం

బీఎస్పీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షులుగా కృష్ణ నియామకం

ముద్ర, తిరుమలగిరి: బహుజన సమాజ్ పార్టీ తిరుమలగిరి మండల శాఖ అధ్యక్షునిగా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన మల్లెపాక కృష్ణను నియమించినట్లు ఆ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గం అధ్యక్షులు చింతకుంట్ల చింతయ్య తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలగిరి  మండలానికి చెందిన మల్లెపాక కృష్ణ ను మండలం పార్టీ అధ్యక్షుడిగా నియమించామని తెలిపారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులుగా నియామకమైన మల్లెపాక కృష్ణ మాట్లాడుతూ తన నియామకం కోసం సహకరించిన నియోజకవర్గ అధ్యక్షులుచింతకుంట్ల చింతయ్య  తో పాటు పలువురు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు తుంగతుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న నిరంకుశ పాలన వ్యతిరేకంగా బహుజన పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు  మండల0 లో  పార్టి అబివృద్దికి కృషీ చేస్తానని చెప్పారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో తాను ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ఉద్యమిస్తానని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ కార్యదర్శి ఎర్ర రాంబాబు నాయకులు మందులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు