ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలి

ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికకు పరిగణలోకి తీసుకోవాలి
  • సెప్టెంబర్ 5న జరిగే ఉత్తమ ఉపాధ్యాయ సన్మానానికి ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా ఎంపిక చేయాలి
  • గోపగాని లింగమూర్తి
  • తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు


తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న,ఉపాధ్యాయులలో ఉత్తమమైన విద్యాబోధన చేస్తున్న వారిని గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ,సత్కరించాలని"తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం"తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు గోపగాని లింగమూర్తి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యకు ఉన్నతమైన ప్రాధాన్యం ఇవ్వాలని,నాణ్యమైన విద్యను అందించేలా,విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ప్రైవేటు పాఠశాలల్లో,4 లక్షల మంది ఉపాధ్యాయులు,30 లక్షలకు పైగా విద్యార్థులకు విద్యాబోధన  చేస్తున్నారని చాలీచాలని జీతాలతో రోజుకు 8 గంటల నుండి 12 గంటలకు పైగా పనిచేస్తూ,రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారనిఅన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం,వారి విద్యాభివృద్ధి కోసం,వివిధ బోర్డు పరీక్షలు,పోటీ పరీక్షల్లో రాణించడం కోసం, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడుతూ ఫలితాలను రాబడుతున్నారనీ వీరు పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం గుర్తింపునిస్తుంది,అందులో చదివే పిల్లలను కూడా ప్రభుత్వం గుర్తించి, వివిధ బోర్డు,పోటీ పరీక్షలకు,స్కాలర్ షిప్ లకు ఎంపిక చేస్తుంది,కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం,రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం,తక్కువ జీతాలతో అధికంగా పనిచేస్తూ,అర్ధాకలితో అలమటిస్తూ,విద్యా-బోధనే ఏకైక లక్ష్యంగా,ఆహోరాత్రులు శ్రమించి విద్యా బోధన చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదు,అనేదే తమకు అర్థం కాని ప్రశ్న అని అన్నారు .కరోనా,లాక్ డౌన్ సమయంలో కూడా,వేలాది మంది ఉపాధ్యాయులు సగం జీతాలకే ఆన్లైన్లో గంటల తరబడి తరగతులు నిర్వహించి,విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటుపడ్డ విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల,రాజకీయ నాయకుల,ప్రజా ప్రతినిధుల పిల్లలకు విద్యను బోధించేది ప్రైవేటు ఉపాధ్యాయులే అనేది జగమెరిగిన సత్యం .తరగతుల బోధనే కాకుండా, ఎంతోమంది ఉపాధ్యాయులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ,సమాజానికి సేవ చేస్తున్న విషయం తెలిసిందే .

తెలంగాణ ఉద్యమ సమయం నుండి నేటి వరకు,రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందజేస్తు ,కవితలు రాస్తూ,పాటలు రాస్తూ,పాడుతూ,రచనలు రాస్తూ సమాజంలో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారనీ అన్నారు.అలాంటి ప్రైవేటు ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వాలు ఎందుకు గుర్తించడం లేదు? ప్రభుత్వాలు సెప్టెంబర్ 5న,దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని, అంగరంగ వైభవంగా జరుపుతున్నాయి.ఆ రోజున ప్రభుత్వాలు కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయులుగా,గుర్తించి సత్కరిస్తుంది.ప్రైవేటు ఉపాధ్యాయులను ఎందుకు గుర్తించవు,సత్కరించవు అనేది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల మదిలో మెదిలే ప్రశ్న అని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయులే...అందులో తేడా చూపరాదని అన్నారు.ఉపాధ్యాయ దినోత్సవం కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులదే కాదు,ప్రైవేట్ ఉపాధ్యాయులది కూడా.ఏ ఉపాధ్యాయుడికైనా ఉపాధ్యాయ వృత్తి ధర్మం ఒక్కటే.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులందరూ చేసే సేవ ఒకటే.. వారితో పాటు ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా సత్కరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సోదర ప్రభుత్.ఉపాధ్యాయ దినోత్సవ వేళ ఉపాధ్యాయులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేయాలి కానీ అవమానించే విధంగా చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం...ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాల్సిన అన్ని అర్హతలు ప్రైవేటు ఉపాధ్యాయులకు కూడా ఉన్నాయి.కావున సెప్టెంబర్ 5న,నిర్వహించు గురుపూజోత్సవం సందర్భంగా,ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా,ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి,సత్కరించాలని, రాష్ట్రంలో ఉన్న,4 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల పక్షాన, ""తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం"" ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని, అన్నారు.