మంత్రి కేటీఆర్ ముందు పంచాయతీ

మంత్రి కేటీఆర్ ముందు పంచాయతీ
  • మంత్రి కేటీఆర్ కు ‘చిక్కాల’ తెచ్చిన తంట..
  • నోరు జారీన చిక్కాల ... సర్ధి చెప్పిన కేటీఆర్..
  • విద్యుత్ రాయితీ నిలిపివేయద్దోన్నందుకు.. మీ కులపోల్లు ఓట్లేస్తే మేం గెలవలేదన్న చైర్మన్ సాబ్
  • సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ కు సిరిసిల్ల వస్త్ర వ్యాపారుల ఫిర్యాదు..
  • ఇరువర్గాలను సముధాయించిన మంత్రి కేటీఆర్.. చిక్కాల మాట తీరుపై అసహనం
  • పదవులు రాకముందు ఓలాగా.. వచ్చాక మరోలాగా .. 
  • మంత్రి కేటీఆర్ కు తలనొప్పిగా సిరిసిల్ల బీఆర్ఎస్ నేతలు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మరోసారి నోరు జారాడు. బీఆర్ఎస్ సీనియర్ నేత, ఏడేండ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ హాయాంలో ఒక్క పదవి లేక.. ఇబ్బందులు పడి..ఏడేండ్ల వనవాసం తర్వాత మంత్రి కేటీఆర్ కరుణించడంతో సిరిసిల్ల సెస్ చైర్మన్గా పదవి దక్కించుకోని మళ్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా లో తన పూర్వ వైభవం దక్కించుకున్నాడు. సెస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రోజే విజయోత్సవ ర్యాలీ లో మాట్లాడుతూ.. చిక్కాల రామారావు వట్టోడు కాదు.. తనకు వ్యతిరేఖం చేసిన వాళ్ల సంగతి చూస్తా ఇప్పటి నుంచి.. ఖబర్ధార్ అంటూ హెచ్చరించి వార్తల్లో నిలిచాడు. ఇదిలా ఉండగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ విద్యుత్ రాయితీకి సంబంధించి కోర్టులో ఒకరు కేసు వేయగా.. విద్యుత్ రాయితీ నిలిపివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు విద్యుత్ రాయితీ బంద్ పడితే .. కార్మికులు.. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు రోడ్డున పడుతారని పాలిష్టర్ సంఘం అధ్యక్షులు మండల సత్యం ఆధ్వర్యంలో జూన్ మాసంలో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఇంటికి వెళ్లి ప్రాదేయపడ్డారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో లేరని, వేరే దేశంలో ఉన్నారని, సర్ వచ్చాక తాము బ్రతిమిలాడుకోని.. ఈ కోర్టు అర్డర్ విషయంలో తమకు చెబుతామని, నోటీసులు ఇవ్వద్దని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా చిక్కాల కోపోద్రిక్తులై.. సిరిసిల్ల లో మీ కులపోళ్లు ఒక్కరే ఓట్లు వేస్తే మేం గెలుస్తలేము.. మీరు ఓటు వేయకున్న పర్వాలేదు..కోర్టు అర్డర్స్ను వెంటనే అమలు చేస్తాం.. బిల్లులు మొత్తం చెల్లించాలే అని కుల ప్రస్తావన తీయడంతో సిరిసిల్ల వస్త్ర వ్యాపారులు ఒక్కసారిగా అవక్కాయ్యారు. తాము ఏం అడిగితే .. సెస్ చైర్మన్ ఏం మాట్లాడుతున్నడంటూ.. బయటకు వచ్చారు. ఈ విషయాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనలో భాగంగా వస్త్ర వ్యాపారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

  • సిరిసిల్ల సెస్​ చైర్మన్​ చిక్కాల రామారావు

ఈ సమావేశంలో సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తీరుపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. విద్యుత్ రాయితీ వెంటనే నిలిపివేయోద్దని.. విజ్ఞప్తి చేయడానికి వెళితే.. తమ సామాజిక వర్గాన్ని కించపరిచినట్లు మాట్లాడారని సిరిసల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మండల సత్యం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.దీంతో చిక్కాల రామారావు కల్పించుకోని అవును అన్నాను.. కోర్టు ఆదేశాలను దిక్కరించవద్దు కదా అంటూ పేర్కోనడంతో వస్త్ర వ్యాపారులకు చిక్కాల రామారావుకు మాట మాట పెరిగే క్రమంలో మంత్రి కేటీఆర్ ఇరు వర్గాలను సముధాయించారు. వాదోపవాదాలు చేసుకుంటూ ఇలానే పోదామా.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఇంకా అప్గ్రేడ్ చేస్తూ ముందుకు వెళ్లి.. మన సిరిసిల్ల నేతన్నలను కాపాడుకుందామా అంటూ ఇద్దరికి కౌంటర్ ఇవ్వడంతో రెండు వర్గాలు మౌనంగా ఉండిపోయాయి. ఇంతలోనే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ రావడంతో చర్చ మరో వైపు వెళ్లడంతో సమస్య సద్దుమనిగింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను తాను కంటికి రెప్పల కాపాడుకుంటానని, బకాయిలు అగస్టు 15 లోగా వచ్చేలా చూస్తానని, విద్యుత్ రాయితికి సంబంధించి కోర్టు స్టే వచ్చినందుకు వల్ల పాత పద్దతిలోనే విద్యుత్ రాయితి వర్తిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం బతుకమ్మ చీరలపైనే ఆధారపడకుండా మార్కెట్ లో డిమాండ్ ఉన్ ఉత్పత్తులను కూడా తయారు చేసి సిరిసిల్ల నేతన్నలకు ఆర్థిక పురోగతిని సాధించాలని పిలుపునిచ్చారు.