రైతులకు యాంత్రికరణ హారం..

రైతులకు యాంత్రికరణ హారం..
  • రూ. 75 కోట్ల మంజూరు
  • 50 శాతం సబ్సిడీ
  • 51 వేల మంది 
  • రైతులకు ప్రయోజనం
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వరంగల్: నర్సంపేట పైలట్ ప్రాజెక్టుగా ఫామ్ మైక నైంజ్ మంజూరైనట్లుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి 75 కోట్ల నిధులు మంజూరు కాగా 50% సబ్సిడీతో రైతులకు యంత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని 51 వేల రైతులకు ఈ పైలెట్ ప్రాజెక్టు కింద లబ్ధి చేకూరనుందన్నారు. ప్రాజెక్టుపై అవగాహన కల్పించేందుకు మూడు నాలుగు రోజుల్లో వ్యవసాయ మార్కెట్లో వ్యవసాయ యాంత్రీకరణ స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

  •  3వేల మోటార్లు.. 30 వేల టార్పాలిన్లు.. 

పైలెట్ ప్రాజెక్టు కింద అనేక యంత్రాలను రైతులకు అందించబోతున్నామన్నారు. 18 పీవీసి పైపుల యూనిట్, హెచ్ డి పి పైపులు, రోటవేటర్లు, మూడు వేల కరెంటు మోటార్లు, 30 వేల టార్పాలిన్ కవర్లు, మినీ ట్రాక్టర్లు, అగ్రికల్చర్ ట్రాన్స్ పోర్టు వెహికల్స్, కలుపు తీసే యంత్రాలు, 4 వేల తైవాన్ పంపులు, మల్టీ క్రషర్స్, ప్యాడి ప్లాంటేషన్ మిషన్స్, కాటన్ పిక్కింగ్ మిషన్స్, హార్వెస్టింగ్ మిషన్లు, పిల్లర్స్ మోడ్రన్ అండ్ టూల్స్ రకరకాల పనిముట్లను సబ్సిడీ ద్వారా అందించనున్నామ న్నారు. నష్టపోయిన రైతులకు రూ.14 కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు. వేసవిలో అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇటీవలే రూ.42 కోట్లను మంజూరు చేసిందన్నారు. రానున్న 100 రోజుల్లో మరిన్ని శుభవార్తను వింటారని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపణలు, అసత్యాలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.