అగ్గికి మక్కజొన్న పంట బుగ్గి

అగ్గికి మక్కజొన్న పంట బుగ్గి

కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం
అయ్యగారి పల్లి గ్రామానికి చెందిన మాలోతు రాజుకు చెందిన రెండు ఎకరాల మొక్కజొన్న కంకులు బుధవారం అగ్నికి బుగ్గి పాలయ్యింది. రాజు ఇటీవల మొక్కజొన్న చేను కంకి విరిచి కుప్పగా పోసి నూర్పిడి చేయడానికి ఆరబోసాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఉప్పగా పోసిన మొక్కజొన్న కంకుల రాశికి నిప్పంటుకొని పూర్తిగా బుగ్గి అయ్యాయి.  ఈ సంఘటనలో సుమారు అరవై వేల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు.